వైయస్‌ఆర్‌సీపీలోకి 50 టీడీపీ కుటుంబాలు చేరిక..

విశాఖ జిల్లాః జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  మాకవరపాలెం మండలం తాడపాల పంచాయతీ అప్పందరపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి. నర్సీపట్నం వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర గణేష్‌ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది రాజన్న రాజ్యమని, టీడీపీ పాలనలో విసిగిపోయి ప్రజలు వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ఆశయాలకు,సిద్ధాంతాలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో పార్టీలోకి చేరినట్లు తెలిపారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందని వారు అన్నారు.

తాజా వీడియోలు

Back to Top