వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి 100 మంది టీడీపీ కార్యకర్తలు చేరిక...

గుంటూరు జిల్లాః జగనన్న ఆశయాలకు ఆకర్షితులై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి.తాజాగా తెనాలి 14వ వార్డుకు చెందిన 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ జగనన్న ఆశయసాధనలో సైనికుల్లా పనిచేస్తామన్నారు.వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తామని పేర్కొన్నారు. జననేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందనే విశ్వాసంతో పార్టీలోకి చేరినట్లు తెలిపారు.
 
Back to Top