విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బాబు

ఏపీ అసెంబ్లీ: రాష్ట్రంలో పెద్దొడికో న్యాయం, పేదోడికో న్యాయం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చీర్ల జగ్గారెడ్డి మండిపడ్డారు. దొంగల చేతికి తాళం ఇచ్చి  విద్యా వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ఈ రోజు రాష్ట్ర్రంలో ప్రశ్నపత్రాల లీక్‌ కార్యక్రమం నడుస్తోందని, ఇందుకు బాధ్యులైన మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసులు భర్తరఫ్‌ చేయాలని కోరారు. నారాయణ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు లీకైనా ప్రశ్నలకు సమాధానం రాస్తున్నారు, పేద విద్యార్థులేమో తెలియని ప్రశ్నలకు సమాధానం రాస్తున్నారని తెలిపారు.  ఇప్పటి వరకు లీకేనట్లు పేపర్లలో వచ్చిన వాటినే మేం ప్రస్తావిస్తున్నాం. అయితే తెలియకుండా ఇంకా ఎన్ని పేపర్లు లీక్‌ చేస్తున్నారో విచారణ చేపట్టాలని కోరారు. లీకేజీలతో ర్యాంకులు సాధించి మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబును భావి తరాలు క్షమించవని హెచ్చరించారు. ఏడాది పాటు విద్యార్థులు కష్టపడి చదివిరాని తెలిపారు. ప్రభుత్వం ఇన్‌స్పైర్‌ కార్యక్రమం నిర్వహించిందని, పరీక్షలు ఎలా రాయలని అవగాహన కల్పిస్తే తాము కూడా పాల్గొన్నామని చెప్పారు. ఈ రోజు మీ మంత్రులను ఇన్‌స్పైర్‌ చేస్తూ పేపర్‌ లీకేజీకి పాల్పడిన ఘటనపై విద్యాశాఖ మంత్రి ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చంద్రబాబు దొంగోడి చేతిలో నుంచి తాళం తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top