తన పాలన గురించి చెప్పుకోలేని బాబు!

తిమ్మాపురం 25 అక్టోబర్ 2012 : షర్మిల తీరు తలపండిన రాజకీయనాయకులను తలపిస్తోందనీ, చంద్రబాబు పాదయాత్రకు, షర్మిల మరో ప్రజాప్రస్థానానికీ
పోలికే లేదనీ ఎం.వి.మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురంజిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్రలో గురువారం ఆయన పాల్గొన్నారు. రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల చెబుతున్నారు, కానీ బాబు తన పాలన గురించి చెప్పుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విధానాలను షర్మిల ఎండగడుతున్నారని, కాంగ్రెస్ వైఫల్యాలను వివరించేందుకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మైసూరారెడ్డి అన్నారు. షర్మిల పాదయాత్రకు అద్భుత ప్రజాస్పందన వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top