బాబు, కిరణ్ రాష్ట్రాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారు

పొందూరు (శ్రీకాకుళం జిల్లా) :

చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను సోనియాగాంధీకి తాకట్టుపెట్టేశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకుడు‌ తమ్మినేని సీతారాం విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పొందూరులో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు హాజరైన వారికి తమ్మినేని ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం పూరిస్తే, ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వెన్నంటి‌ నిలిచి శ్రీ జగన్ నిరాహార దీక్ష చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు.

పార్టీలో పలువురి చేరిక :
శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజా గర్జన సాక్షిగా కాంగ్రెస్, టిడిపిలకు చెందిన ఎనిమిది మంది సర్పంచ్‌లు, 16 మంది మాజీ సర్పంచ్‌లు, మరో 8 మంది ఎంపిటిసి మాజీ సభ్యులు ఒకేసారి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Back to Top