పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ విశ్రమించమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ పేర్కొంది. పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ఓ సమావేశం నిర్వహించింది. పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎస్‌.విజయచందర్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్దసారధి మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన పథకాలను, నవరత్నాలను ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ ప్రచార కమిటీపై ఉందన్నారు.

పత్రికలు, చానళ్ల ద్వారానే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం చేపట్టాలని సూచించారు. పార్టీ పటిష్టతకు కూడా ప్రచార కమిటీ పాటుపడాలన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ....వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రచార కమిటీలపై గురుతర భాద్యత ఉందని అది గుర్తుంచుకుని నేతలు పని చేయాలని కోరారు. పార్టీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పార్టీని, పార్టీ విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లడం అనేది ప్రచార కమిటీ పనితీరుపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
Back to Top