హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. 10 జిల్లాల తెలంగాణను 27 జిల్లాలుగా చేసే విషయమై టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైయస్సార్సీపీని ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం పెల్లుబికింది. ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. <br/>సీఎం డౌన్ డౌన్ అంటూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నినదించారు. కేసీఆర్ తుగ్లక్ పాలనను తలపిస్తున్నారని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల గుర్తింపు ఉన్న ప్రతీ పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం రాజ్యాంగాన్ని గౌరవించినట్లు అవుతుంది. కానీ, కేసీఆర్ అన్ని పార్టీలను పిలిచి వైయస్సార్సీపీని ఆహ్వానించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. <img src="/filemanager/php/../files/News/gadapaku/unnamed%20(9).jpg" style="width:696px;height:622px"/><br/>కేసీఆర్ నిరంకుశ వైఖరికి నిరనసగా ఆందోళనకు దిగిన వైయస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు.