యనమల నిబంధనలు తెలుసుకో

హైదరాబాద్‌: ఏపీ అసెంబ్లీ తీరు దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే  సుజయకృష్ణ రంగారావు అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే రోజాపై సస్పెన్షన్ వేశారని మండిపడ్డారు. రోజాపై సస్పెన్షన్  వేటు నిబంధనలకు వ్యతిరేకం అని తూర్పారబట్టారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, రోజా పై సస్పెన్షన్ అంశాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా  వైఎస్సార్సీపీ  అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ టీడీపీపై నిప్పులు చెరిగారు.  అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ అనే అంశం మహిళకు సంబంధించిందని, ఇందులో ఎక్కువమంది దళిత బాధితులే ఉన్నారని, ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి వివరించి వారి కళ్లు తెరిపించాలనే ప్రయత్నంతోనే తమ నేత రోజా మాట్లాడారన్నారు. ఎక్కడ దోషులుగా దొరికిపోతామో అన్న భయంతో ఆమెపై ప్రభుత్వం అక్రమంగా సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. యనమల రామకృష్ణ నిబంధనలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

తాజా వీడియోలు

Back to Top