ప్రభుత్వ నిర్వాకం వల్లే భీమా సొమ్ము రాలేదు

వైయస్ఆర్ కడప: టీడీపీ సర్కార్‌ నిర్వాకం వల్లే 2012 సంవత‍్సరానికి రావాల్సిన పంటల భీమా సొమ‍్ము రాలేదని కడప పార‍్లమెంట్‌ సభ‍్యుడు అవినాష్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంలో ఏపీ ప్రభుత‍్వం తాత్సారం చేసినందువల‍్లే రైతులకు రావాల్సిన పంటల భీమా నగదు విడుదల కాలేదని చెప్పారు. ఫలితంగా రైతులు చాలా ఇబ‍్బందులు పడుతున్నారన‍్నారు. ఇప‍్పటికైనా ప్రభుత‍్వం స‍్పందించి కేంద్రానికి వెంటనే లేఖ రాసి 2012 సంవత‍్సరానికి రావాల్సిన పంటల భీమా సొమ‍్ము వచ్చేలా చర‍్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top