<br/>హైదరాబాద్) అగ్రి గోల్డ్ బాధితుల తరపున అసెంబ్లీ లో వైఎస్సార్సీపీ వైఖరి వినిపిస్తున్న సమయంలో ప్రభుత్వం అర్థాంతరంగా శాసనసభను వాయిదా వేయించింది. దీంతో పత్రికా ప్రకటన రూపంలో వైఎస్సార్సీపీ తమ వాదన్ని ప్రజల ముందుకు తెచ్చింది.అగ్రి గోల్డ్ వ్యవహారంలో ఇంతకు ముందే అటాచ్ చేసుకొన్న ఆస్తుల్ని వేలం వేస్తూనే, సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. తద్వారా అటాచ్ మెంట్ కాకుండా వేరుపడిన ఆస్తుల్ని తెలుగుదేశం నాయకులు ఏ విధంగా కుమ్మక్కై అమ్ముకొన్నారనేది బయట పడుతుందని పార్టీ అభిప్రాయ పడింది. దేశ, విదేశాల్లో తెలుగుదేశం నాయకులు తమ అనుచరులకు ఏ రకంగా కట్టబెట్టినదీ బయటకు వస్తుందని పేర్కొంది. అటువంటి ఆస్తుల్ని కూడా బయటకు తీసి వేలం వేసినట్లయితే బాధితుల ప్రతీ రూపాయి వడ్డీ తో సహా ఇప్పించటానికి వీలవుతుంది. అందుకే సీబీఐ తో సమగ్ర దర్యాప్తు చేయించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది.