ఆశ‌ల మీద మ‌ట్టి

కడప: ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా అడుగుతారని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని, కానీ వాళ్లిద్దరూ ప్రజల ఆశలపై మట్టి చల్లారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు తరహాలో మోదీ కూడా రెండు కేజీల మట్టి చల్లి వెళ్లిపోయారని తెలిపారు. హోదా రాకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ పూర్తిగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ రాజధాని నిర్మాణం చేపడుతున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకోవాలని సూచించారు.
Back to Top