మరో మూడు నెలల్లో మీ బిడ్డే ముఖ్యమంత్రి

ఏలూరు :

'మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి పీఠంపై మీ బిడ్డ, మీ మనుమడు, మీ తమ్ముడు, మీ అన్నగా నేనుంటాను. అప్పుడు మీ పనులన్నీ చేస్తాను. ప్రజలకు చేసిన పనులను, రాష్ర్టంలో జరిగిన అభివృద్ధిని చూపించి 2019లో ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను’ అని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ఆర్ జనభేరి‌ మూడవరోజు బుధవారం శ్రీ జగన్మోహన్‌రెడ్డి చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త మద్దాల రాజేశ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రజలను‌ ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సేవచేసే అవకాశం మన ఎమ్మెల్యేలకు లభించలేదన్నారు.‌

ఈ సభలో శ్రీ జగన్ సమక్షంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. అడుగడుగునా ప్రజలను పలకరిస్తూ, వారి కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. శ్రీ జగన్ గురుభట్లగూడెం సెంట‌ర్ మీదుగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు.

Back to Top