సమైక్య శంఖారావం ఏర్పాట్లపై జగన్ సమీక్ష

హైదరాబాద్, 22 అక్టోబర్ 2013:

సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ముఖ్య‌ నేతలతో  శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నేతల అభిప్రాయాలు, సూచనలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సమైక్య శంఖారావం సభకు భారీగా తరలివచ్చే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలని నాయకులకు ఈ సందర్భంగా శ్రీ జగన్‌ సూచించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి చేస్తున్న పోరాటం వృథాగా పోరాదని తిరుపతిలోని ఎస్వీయూ విద్యార్థులు స్పష్టం చేశారు. శ్రీ జగన్ తరహాలోనే ఇతర పార్టీల ‌నాయకులు కూడా సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. సమై‌క్య శంఖారావం సభకు తిరుపతి నుంచి వేలాదిగా విద్యార్థులు తరలి వెళతామని స్పష్టం చేశారు. సమైక్య శంఖారావానికి మద్దతుగా తుడా సర్కిల్లో విద్యార్థులు దీక్ష చేపట్టారు.

సమైక్య శంఖారావానికి కులవృత్తుల వారు భారీగా తరలి రావాలని శ్రీకాకుళం జిల్లాలో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు మంగళవారం పిలుపునిచ్చారు. వరదు కళ్యాణి ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో రైతులు, రజకులు, వడ్రం‌గులు, చేనేత కార్మికులు, కులవృత్తుల వారు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తు‌న్నదని దుయ్యబట్టారు.

Back to Top