మహానేతకు జననేత జగన్ నివాళులు

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా),

1 అక్టోబర్ 2013: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు‌, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారంనాడు నివాళులు అర్పించారు.‌ ఇడుపులపాయలోని వైయస్ఆర్ సమాధిపై‌న పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రీ జగన్ మౌనంగా ప్రార్థనలు జరిపారు.‌ పదహారు నెలల తరువాత శ్రీజగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో అడుగుపెట్టారు. నిర్బంధంలో ఉండగా రెండు వర్ధంతులు, రెండు జయంతులకు కూడా ఆయన దూరమయ్యాయి. నిర్బంధంలో ఉన్నంతకాలం తండ్రి జ్ఞాపకాల్లో గడిపిన శ్రీ జగన్ కోర్టు అనుమతితో ‌ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయ వచ్చారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డితో పాటు వైయస్ఆర్ కుటుంబ సభ్యులు ‌మహానేతకు పుష్పాంజలి ఘటించారు. మహానేత సతీమణి, శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మ, ‌‌తన సతీమణి భారతితో కలిసి ‌శ్రీ జగన్ ప్రార్థనలు చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో వైయస్ఆర్ ఘా‌ట్ కిక్కిరిసింది. తమ అభిమాన ‌నాయకుడు ఎన్నో రోజుల తర్వాత కనిపించేసరికి అభిమానులు ఉద్వేగంతో స్పందించారు. అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఇడుపులపాయ చేరుకున్న శ్రీ జగన్‌ :
అంతకు ముందు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయమే ఇడుపులపాయకు చేరుకున్నారు. పదహారు నెలల నిర్బంధం అనంతరం ఆయన తొలిసారిగా తండ్రి సమాధిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున ఐదు గంటలకు వెంకటాద్రి ఎక్సుప్రెస్‌లో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు శ్రీ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా‌ తమ అభిమాన జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానుల తాకిడిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు భారీగా బలగాలను మొహరించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే రైల్వే స్టేషన్‌కు చేరుకొని శ్రీ జగన్‌ను చూసేందుకు గంటల తరబడి అభిమానులు ఎదురు చూశారు. శ్రీ జగన్ రాకతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.‌ శ్రీ జగన్‌ను తాకేందుకు, ఆయనతో మాట్లాడేందుకు పోటీపడ్డారు. అభిమానులను అదుపు చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన శ్రీ జగన్  రైల్వే స్టే‌షన్ నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకున్నారు.

కర్నూలులో ఘన స్వాగతం‌ :
మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు సుదీర్ఘ విరామం తరువాత ఇడుపులపాయ వెళుతున్న శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డికి కర్నూలులో అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వెంకటాద్రి ఎక్సుప్రెస్‌లో వెళ్తున్న ఆయనను కలిసేందుకు వచ్చిన సమైక్యవాదులు, అభిమానులు, కార్యకర్తలతో కర్నూలు రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. విభజన నిర్ణయం తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏ పార్టీ నాయకులూ పట్టించుకోవడంలేదని‌, ఎవరూ చేయని సాహసం ఒక్క శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే చేస్తున్నారంటూ అభినందించారు.

రాష్ట్ర విభజనను గతంలో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అడ్డుకుంటే, ఇప్పుడు సమైక్య రాష్ట్రం కోసం శ్రీ జగన్ శంఖారావం పూరిస్తున్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మిగిలిన పార్టీలు కూడా అనుసరించాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు.

Back to Top