సీఎం నాలుగు గంటల దీక్షా!.. చాలా గొప్ప!

న్యూఢిల్లీ :

‘సీఎం కిరణ్‌ ఎంతసేపు దీక్ష చేశారు? అబ్బ.. నాలుగు గంటల సేపు దీక్ష చేశారా? చాలా గొప్పోడు కదయ్యా..! నాలుగు గంటలు చేశారా? చాలా చాలా గొప్ప కదా! కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడైనా ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేశారేమో ఒక్కసారి ఆయనను అడగండి మీడియా ప్రతినిధులతో శ్రీజగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ దీక్ష చేశారు‌ కదా... దీన్ని మీరు ఎలా చూస్తారు? అని విలేకరులు అడిగినప్పుడు శ్రీ జగన్‌ ఈ విధంగా స్పందించారు. కడుపు మాడ్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం 8 రోజులు తిండి తినకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి సీఎం కిరణ్‌కు అడిగి తెలుసుకోండి అన్నారు.

నాలుగు గంటలు దీక్ష చేశారట! ఎన్నికలకు కరెక్టుగా మూడు వారాల్లో షెడ్యూల్ వస్తోంది.‌ ఎట్లాగూ ఎన్నికలకు పోక తప్పదని చెప్పి.. 4 గంటలసేపు 200 మందితో దీక్ష చేశారట! దానికో పబ్లిసిటీ.. దానికో బిల్డప్పు.. అని శ్రీ వైయస్ ‌జగన్‌ అన్నారు. కేసీఆర్ 9 రోజులు దీక్ష చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. ‘నాకు బీపీ లేదు.. షుగర్ లేదు.. ఎలాంటి రోగాలూ లేవు. కేసీఆర్‌కు షుగర్ ఉంది.. చంద్రబాబు‌కూ షుగ‌ర్ ఉంది.. కిరణ్ కుమా‌ర్‌ రెడ్డి దీక్ష చేయలేదు. నేను రాసిస్తా.. 36 గంటలు కూర్చోమని చెప్పండి.. తినకుండా.. తాగకుండా.. ఏమీ చేయకుండా.. షుగర్ పేషెంట్లు ఎలా తట్టుకుంటారో చూస్తా..!’ అన్నారు.

Back to Top