జననేతను కలిసిన అంతర్జాతీయ బాక్సింగ్‌ క్రీడాకారిణి
విశాఖపట్నం: ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం లేదని అంతర్జాతీయ బాక్సింగ్‌ క్రీడాకారిణి బొగ్గు మౌనిక వాపోయారు. దువ్వపాలెం జంక్షన్‌ వద్ద వైయస్‌ జగన్‌ను కలిసి బాక్సింగ్‌ క్రీడాకారిణి మౌనిక తన సమస్యలు జననేతకు చెప్పుకుంది. ప్రభుత్వం పేద క్రీడాకారులను పట్టించుకోవడం లేదని, సపోర్టు ఇవ్వండి అన్నా.. ఇంకెన్నో పతకాలు సాధిస్తానని కన్నీరు పెట్టుకుంది. మౌనిక క్రీడా స్ఫూర్తిని చూసి చలించిన వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు క్రీడాకారణి మౌనిక మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే ప్రాణం.. బాక్సింగ్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించానని చెప్పారు. సపోర్టు చేసేవారు లేకపోవడంతో పైకి ఎదగలేకపోతున్నానని, వైయస్‌ జగన్‌ను కలిసి తన సమస్య చెప్పుకున్నానని, అన్న అండగా ఉంటానన్నాడని, భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని పతకాలు సాధించి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top