సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది: శరత్‌చంద్రారెడ్డి

అనంతపురం, 29 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడమంటే తనకు సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని మాజీ ఎమ్మెల్యే తరిమెల రంగారెడ్డి కుమారుడు, శేషానందరెడ్డి సోదరుడు, తెలుగురైతు ఉపాధ్యక్షుడు శరత్‌ చంద్రారెడ్డి అభివర్ణించారు. ఇంతకాలంగా తాను అద్దె ఇంటిలో ఉన్నట్లుగా ఉండేదని ఆయన అన్నారు. వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో శరత్‌ చంద్రారెడ్డి సోమవారం సాయంత్రం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం సాయంత్రానికి అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌ వద్దకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శరత్‌చంద్రారెడ్డి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సప్తగిరి సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ‌ జరిగింది. శరత్‌ చంద్రారెడ్డితో పాటు 19 మంది మాజీ సర్పంచ్‌లు, 14 మంది ఎంపీటీసీలు, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ మండలాధ్యక్షులు, ముగ్గురు నీటి పారుదల సంఘం అధ్యక్షులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తాజా వీడియోలు

Back to Top