సోమిరెడ్డి బిచ్చగాడు కాదు "రిచ్" గాడు

  • సోమిరెడ్డి అక్రమాస్తుల చిట్టాను బయటపెట్టిన కాకాని
  • సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లలో అక్రమాస్తులు
  • సింగపూర్ రఫెల్ క్లబ్ లో మెంబర్ షిప్ 
  • ఆధారాలతో సహా బహిర్గతం చేసిన కాకాని
  • సోమిరెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
నెల్లూరుః రాజకీయాల్లోకి వచ్చి ఇళ్లు తప్ప అన్ని పోగుట్టుకున్నానని ప్రచారం చేసుకుంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బండారాన్ని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి బయటపెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారని ఆధారాలతో సహా మీడియాకు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో సోమిరెడ్డి అక్రమాస్తుల చిట్టాను మీడియా ద్వారా జనం ముందుంచారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, సోమిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే సోమిరెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని కాకాని గోవర్థన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. సింగపూర్, మలేషియా, హాకాంగ్‌ దేశాల్లో కూడబెట్టిన అక్రమాస్తులను ఆధారాలతో సహా కలర్‌ జిరాక్సులు తీసుకొచ్చి చూపించారు. 

సింగపూర్‌ క్లబ్‌లో మెంబర్‌షిప్‌ 
పేదవాడినని చెప్పుకుని తిరిగే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సింగపూర్‌లోని రఫెల్‌ క్లబ్‌లో మెంబర్‌షిప్‌ కూడా ఉందని వెల్లడించారు. గత ఎన్నికలు ముగిసిన తర్వాత సింగపూర్‌ వెళ్లి అక్కడ గడిపి వచ్చిన హోటల్‌ బిల్లులను కూడా చూపించారు. సోమిరెడ్డి పేరుతో రిజిస్టర్‌ అయిన కంపెనీల వివరాలను వెల్లడించారు. రామస్వామి వీరన్, రామన్‌సింగ్‌ల పేరుతో సింగపూర్, మలేసియా, హాంకాంగ్‌ దేశాల్లో కూడబెట్టిన అక్రమాస్తుల చిట్టా బయటపెట్టారు. వారిద్దరి సాయంతో సింగపూర్‌లో కొన్న భూములు, విల్లాల వివరాలను ఆధారాలతో సహా కాకాణి బయటపెట్టారు. మే బ్యాంక్, ఓసీబీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తదితర బ్యాంకుల ద్వారా జరిపిన లావా దేవీల వివరాలను మీడియాకు వివరించారు. 

సోమిరెడ్డికి ఉన్న ఇంటర్నేషనల్‌ సెల్‌ నంబర్‌ నుంచి 51 నిమిషాల పాటు సాగిన సెల్‌ఫోన్‌ కాల్‌డేటాను బహిర్గతం చేశారు. ప్రభుత్వ విలువ ప్రకారం సోమిరెడ్డి కూడబెట్టిన అక్రమాస్తుల విలువ దాదాపు 500 కోట్లకు పైమాటేనని మార్కెట్‌ విలువతో చూస్తే వెయ్యి కోట్లకు దాటి ఉంటుందని చెప్పారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఫారెన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డులో మెంబర్‌షిప్‌ తప్పనిసరిగా ఉండాలని అవన్నీ సోమిరెడ్డి ఎలా సంపాదించారో దర్యాప్తు జరిపించాలని కాకాణి డిమాండ్‌ చేశారు. సోమిరెడ్డి జ్యోతి పేరుతో అల్లిపురం, నెల్లూరు లోకల్‌ అడ్రస్‌తో ఆస్తులు కొనుగోలు చేసిన విషాయాన్ని బయటపెట్టారు. 

సోమిరెడ్డిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా అక్రమార్జన చేస్తున్న సోమిరెడ్డిపై సీబీఐ విచారణ చేయించాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో నష్టపోయానని బయట ప్రపంచాన్ని నమ్మించి పేదోడిగా పోజు కొడుతున్న సోమిరెడ్డి అసలు రంగు బయటపడిందని ఆయన తెలిపారు. నిప్పులమని చెప్పుకునే చంద్రబాబు, సోమిరెడ్డిలు ఆధారాలతో సహా వెల్లడైన అక్రమాస్తులకు సంబంధించి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డబ్బులు లేవని చే బదులు తీసుకునే సోమిరెడ్డి అసలు అవినీతి కథ ఇదేనని బహిర్గతం చేశారు.  ఆయన పేరు మీద నమోదైన ఆస్తులే సోమిరెడ్డి అవినీతికి పరాకాష్ట అని వెల్లడించారు. 

తాజా ఫోటోలు

Back to Top