కుష్టురోగ పీడితులకు షర్మిల పరామర్శ

పెద్దాపురం (తూ.గో.జిల్లా),

17 జూన్‌ 2013: కుష్టురోగ పీడితులను శ్రీమతి షర్మిల సోమవారం పరామర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమె సోమవారంనాడు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురంలో ఉన్న కుష్టురోగుల వద్దకు వెళ్ళి శ్రీమతి షర్మిల వారి ఇబ్బందుల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

కాగా, సోమవారం ఉదయం శ్రీమతి షర్మిల పెద్దాపురంలోని మున్సిపల్ సెంట‌ర్‌ నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం దర్గా సెంటర్, జి. రాగంపేట, వడ్లమూరు మీదుగా ఆమె గోరింట చేరుకుంటారు. గోరింటలో వైయస్‌ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొనే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పులిమేరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 182వ రోజు సోమవారం శ్రీమతి షర్మిల 14.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

Back to Top