బొమ్మల తయారీ కుటుంబాలకు షర్మిల భరోసా

తుని (తూ.గో.జిల్లా),

23 జూన్‌ 2013: జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కొయ్యలక్క బొమ్మలు తయారు చేసే కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా తాము తయారు చేస్తున్న బొమ్మలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని బొమ్మలు తయారీ చేసే కుటుంబాల వారు శ్రీమతి షర్మిల ముందు వాపోయారు. తాము పడుతున్న బాధలను వారు ఆమెకు వివరంగా చెప్పుకున్నారు. కరెంట్ కోతల కారణంగా బొమ్మల తయారీకి తీవ్ర ఆటంకం కలుగుతున్నదని తెలిపారు.

ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానితో అంటకాగుతూ రక్షణ కవచంలా నిలిచి పడిపోకుండా నిరంతరం కాపాడుతున్న చంద్రబాబు, టిడిపి వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంనాడు తూర్పుగోదావరి జిల్లా పాతకొట్టం చేరుకుంది. ఈ సందర్భంగా ఆ గ్రామంలో కొయ్యలక్క బొమ్మలు తయారు చేసే కుటుంబాలను శ్రీమతి షర్మిల కలిసి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

శ్రీమతి షర్మిల స్వయంగా తమ వద్దకు వచ్చి తమ గురించి విచారించడంతో ఉబ్బతబ్బిబ్బయిన బొమ్మల తయారీ కుటుంబాలు ఒక్క సారిగా తమ ఆవేదనను వెళ్ళబుచ్చుకున్నారు. నలభై ఏళ్లుగా తమ బొమ్మలకు గిట్టుబాటు ధరలు రావడంలేదని వారు వాపోయారు.

Back to Top