హమీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాకముందే నిరుద్యోగులు, విద్యార్థులకు ఎన్నో హమీలు ఇచ్చి అందులో ఒక్కటి కుడా నేరవేర్చక మోసగించారని,  అసెంబ్లీలో దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను ఉరవకొండ వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాంట్‌లో వారు పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జిలాన్‌ మాట్లాడుతూ వైయస్‌  జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ఫీజులు మంజూరు చేయకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని చెప్పినట్లు వివరించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరినట్లు చెప్పారు.

Back to Top