వారంలోగా నీరివ్వకపోతే ఆందోళన తప్పదు

  • శ్రీశైలం నుంచి కేసీకెనాల్, తెలుగుగంగలకు నీరు ఇవ్వాలి
  • ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
  • రాజోలి దగ్గర రిజర్వాయర్ పనులు మొదలుపెట్టాలి
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ అవినాష్ రెడ్డి
వైయస్ఆర్ జిల్లాః కేసీ కెనాల్ , తెలుగు గంగ ప్రాజెక్ట్ లకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని వైయస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిలు కలెక్టర్ ను కలిసి నీళ్లు వచ్చేలా చూడాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్ట్  లో 870 అడుగల మేర సమృద్ధిగా నీరున్నందున దిగువ  ప్రాజెక్ట్ లకు నీరు విడుదల చేయాలన్నారు. అదే విధంగా ప్రతి సంవత్సరం కుందూరు నుంచి నీరు వృథాగా పోతుందని....రాజోలి దగ్గర రిజార్వాయర్ పూర్తి చేయడంతో పాటు పలుచోట్ల ఆనకట్టలు కట్టాలని సూచించారు. 

కుందూరు నుంచి 40,50 టీఎంసీలు ప్రతి ఏడాది సోమశిలకు వృథా పోతున్నాయన్నారు. రాజోలి దగ్గర రిజర్వాయర్ ఉంటే 2.9 టీఎంసీలు స్టాక్ పెట్టుకునే వాళ్లమన్నారు. అప్పుడు డిసెంబర్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు.  రాజోలి దగ్గర రిజార్వాయర్ కు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ శంకుస్థాపన చేశారని,  ఆతర్వాత వచ్చిన వారెవరూ దాన్ని  పట్టించుకోవడం లేదన్నారు. బాబు అధికారంలోకి వచ్చి 4 ఏళ్లవుతున్నా ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధే లేదని విమర్శించారు.  నీరు ఉండి కూడ రైతులకు ప్రయోజనం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు.  కేసీ కెనాల్, తెలుగు గంగలకు కు నీళ్లు వదలడంతో పాటు రాజోలి రిజర్వాయర్ పనులు మొదలుపెట్టాలని,  రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారంలోగా ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోతే రైతుల మద్దతుతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. 
Back to Top