ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేయాలి

తండ్రి స్ఫూర్తితో ప్రజల కోసం
హైదరాబాద్‌: ఆరు నెలల పాటు 125 నియోజకవర్గాలు, 3 వేల కిలోమీటర్ల పాదయాత్రగా వైయస్‌ జగన్‌ చాలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. 125 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తానని వైయస్‌ జగన్‌ చెప్పడం జరిగిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన తండ్రిలా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో వైయస్‌ జగన్‌ పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్తున్నారన్నారు. 

 ప్రజా సంకల్ప పాదయాత్రపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులతో చర్చించడం జరిగిందని కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ ఏ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందో.. ఆ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తూ రైతులు, ప్రజలు, విద్యార్థుల కష్టాలు తెలుసుకోనున్నారన్నారు. ఒక నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంటే మరో నియోజకవర్గ నాయకులు వచ్చి జననేతను కలుసుకునే విధంగా కోఆర్డినేటర్‌ను కూడా నియమించడం జరిగిందన్నారు. నవరత్నాల పథకాలకు ఏ విధంగా మెరుగులు దిద్దాలి. పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ కష్టాలన్నీ తీర్చే విధంగా మ్యానిఫెస్టో తయారు చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందో ఎండగట్టనున్నారన్నారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top