దమ్ముంటే జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేయండి

– ప్రభుత్వానికి  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సవాల్‌
– అగ్రిగోల్డ్‌ భూములను మంత్రులే కొనుగోలు చేశారు
–రూ.1182 కోట్లు చెల్లిస్తే బాధితులకు న్యాయం చేయొచ్చు
– చంద్రబాబు మానవత్వంతో వ్యవహరించాలి
– అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ సోదరుడు సీతారామ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు
–ఆగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల పేర్లు ఆన్‌లైన్‌ లో పెట్టాలి

ఏపీ అసెంబ్లీ: అగ్రిగోల్డ్‌ భూముల కొనుగోలుపై ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్డి చేత జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ భూములను మంత్రి ప్రతిపాటి పుల్లారావు తన భార్య పేరిట కొనుగోలు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి చంద్రబాబు స్టేట్‌మెంట్‌ కోసం చాలా మంది బాధితులు వేయ్యి కళ్లతో ఎదురుచూశారని, ప్రభుత్వం కొద్దొగొప్పో ఆదుకుంటారని ఎదురు చూశారని చెప్పారు. అయితే బాధితులకు ఎలాంటి సాయం చేయకుండా చంద్రబాబు తన స్టేట్‌మెంట్‌ ముగించారని వైయస్‌ జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం అగ్రిగోల్డ్‌ పై జరిగిన చర్చలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు.  రాష్ట్రంలో 19 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారు. వీరికి సంబందించి రూ.3500 కోట్ల బకాయిలు ఉన్నాయని సీఐడీ తేల్చిందన్నారు. దేశవ్యాప్తంగా 32 లక్షల డిపాజిటర్లు ఉన్నారని చెప్పారు. కేవలం రూ.1182 కోట్లు మాత్రమే డబ్బులు చూసుకుంటే 13 లక్షల 83 వేల మంది డిపాజిటర్లకు పూర్తిగా న్యాయం జరిగిపోతుందన్నారు. ఆయనలోని మానవత్వాన్ని జాగృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఆస్తుల విలువ 18680 ఎకరాలు ఉన్నాయి, మరో 90 వేల స్క్వర్‌ యార్డు స్థలాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో సీఐడీ విచారణ దారుణంగా ఉందన్నారు. ఆగ్రిగోల్డ్‌ పరివార్‌ స్టాండర్స్, ఇక్విటీ సెల్స్‌ అన్నవి కూడా విచారణలో పరిగణలోకి తీసుకోవాలన్నారు. వీటిని ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టడం లేదని బాధితులు అడుగుతున్నారు. డిపాజిటర్ల పేర్లు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంతో బాధితులు నష్టపోతున్నారు. పేర్లు లేని వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వీలుంది. ఇంకో విషయం కూడా ఉంది. అరెస్టులు ఎంత మందిని చేశారని గమనిస్తే..చైర్మన్, ఆయన తమ్మున్ని అరెస్టు చేశారు. వీరు 8 మంది అన్నదమ్ములు. వీరిలో సీతారామ్‌ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన్ను అరెస్టు చేయడం లేదు. దీని కారణంగా ఏరకంగా కొన్ని ఆస్తులు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య కూడా కొనుగోలు చేశారు. 2015లో కొనుగోలు చేశామని మంత్రి నోటి నుంచి వచ్చిందన్నారు. అంతకు ముందే అగ్రిగోల్డ్‌పై కేసులు కూడా నమోదు అయ్యాయని గుర్తు చేశారు. మంత్రి భార్య వెంకాయమ్మ తక్కువ రేటుకు ఆగ్రిగోల్డ్‌ చైర్మన్‌ బంధువు దివాకర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారని గత సభలోనే వెల్లడించామన్నారు. తిరుపతిలో కూడా ఇలాంటి ఘటన జరిగిందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను తిరుపతిలో హోటల్‌ను రూ.14 కోట్లకు విక్రయించారని సభ దృష్టికి తీసుకొని వచ్చామన్నారు. సీతారామ్‌భార్య అవ్వ పుష్పలత కూడా 31.781 ఎకరాలు బ్రహ్మంగారి మఠంలో భూములు అమ్మారు. 18.8.2016లో సీతారామ్‌ కూతురు కూడా 8 ఎకరాల భూములు విక్రయించారని వివరాలతో సహా వెల్లడించారు.

మంత్రిపుల్లారావు చెప్పిన ఉదయ్‌ దినకరన్‌ హాయ్‌ల్యాండ్‌లో డైరెక్టర్‌గా, సీఈవోగా ఉన్నారని గుర్తు చే శారు. ఈ హాయ్‌ల్యాండ్‌ ఎవరిదో అందరికీ తెలుసు అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. హాయ్‌ల్యాండ్‌కు సంబంధించిన ఆస్తులు ఎందుకు వేలం వేయడం లేదని ప్రశ్నించారు. హౌస్‌ కమిటీ కూడా ప్రివిలేజ్‌ కమిటీ మాదిరిగానే అవుతుంది. అందులో ఉండేది అధికారపక్షమే ఎక్కువుగా ఉంది. దమ్ముంటే జ్యుడీషియల్‌ విచారణకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. 
Back to Top