ప‌సుపు రైతుల‌ను ఆదుకోవాలి

వైయ‌స్ఆర్ జిల్లా: ప‌సుపు రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని, క్వింటాలుకు రూ. 10 వేల క‌నీస ధ‌ర ఇవ్వాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు డిమాండ్ చేశారు. గురువారం క‌డ‌ప మార్కెట్ యార్డులో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజ‌ద్‌బాషా, ర‌ఘురామిరెడ్డి, బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ వెంక‌ట సుబ‌య్య‌లు ప‌ర్య‌టించారు. మార్కెట్‌లో పసుపు రైతుల క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

Back to Top