జేసీపై చ‌ర్య‌లు తీసుకోవాలి

నందికొట్కూరు:  బ‌స్సు ప్ర‌మాద దుర్ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ చేప‌ట్టాల‌ని, ప్ర‌తిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్‌ చేశారు. నందికోట్కూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు డౌన్, డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున్న ఎమ్మెల్యే, వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ప్రతిపక్ష నేతను అంతు చూస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పాలన నిరంకుశ పాలనగా తలపించడం తగదని చెప్పారు. పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను ఎలా తరలిస్తారని వైయ‌స్‌ జగనన్న ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. రెండోవ డ్రైవర్‌ లేకపోయిన సంఘటన జరిగిన తరువాత తీసుకొచ్చి డిక్కిలో ఉన్నాడని చెప్పడం హస్యస్పదంగా ఉందని పేర్కొన్నారు. బస్సు యాజమాన్యంపై కేసులు నమోదు చేసి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం బాబు అబద్దాలను భరించలేక వైయ‌స్‌ఆర్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఓటుకు నోటుకు కేసును తప్పిదారి పట్టించేందకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చేతులు కలిపినట్లు ఆరోపించారు. టెండర్లు పిలువకుండానే టీడీపీ నాయకులకు పనులు ఇవ్వడం వెనుక అంతర్యమేమిటని నిలదీశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు జడ్ప్‌టీసీ యుగంధర్‌రెడ్డి, నాయకులు చిట్టిరెడ్డి, భాస్కరెడ్డి, పద్మానాభరెడ్డి, బాలస్వామి, సలాంఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top