కేసులు వెంట‌నే ఎత్తివేయాలి

తొండూరుః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తేయాలని వైయ‌స్ఆర్ జిల్లా తొండూరు మండ‌లంలో పార్టీ నేత‌లు నిరసన తెలిపారు. గురువారం తొండూరు మండల నాయకులు సాయిబాబా ఆలయం వద్ద నుండి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కనకదుర్గయ్యకు వినతి పత్రం సమర్పించారు.  బస్సు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని నందిగామ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినందుకు అక్రమ కేసును ప్రభుత్వం బనాయించిందని.. వెంటనే ఎత్తేయాలంటూ నిరసన తెలిపి తహసీల్దార్‌ కనకదుర్గయ్యకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తొండూరు  పార్టీ నాయకులు భాస్కర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా సెక్రటరీ షఫి, వాటర్‌ షెడ్‌ చైర్మన్‌ రాఘవరెడ్డి, బంగారు మునెయ్య, జగన్‌మోహన్‌రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Back to Top