షర్మిల యాత్రకు స్పందన అద్వితీయం

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట షర్మిల చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన అద్భుతమని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరులో ఎనిమిదో రోజు యాత్ర ప్రారంభించిన షర్మిలతో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైసూరా మాట్లాడుతూ రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారని చెప్పారు. చంద్రబాబు మాత్రం తన పాలన గురించి  చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.  షర్మిల మరో ప్రజాప్రస్థానానికీ, చంద్రబాబు పాదయాత్రకూ అసలు పోలికే  లేదని స్పష్టం చేశారు. పాదయాత్రలో షర్మిల ప్రజలతో మమేకవుతున్న తీరు తలపండిన రాజకీయ నేతలను  స్ఫురింపజేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా మరో ప్రజాప్రస్థానానికి తరలివస్తున్నారని మైసూరా చెప్పారు.

Back to Top