షర్మిల పాదయాత్ర విజయవంతానికి పూజలు

రాయవరం: వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ రాయవరంలో పార్టీ నాయకులు, అభిమానులు  పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ మండల కన్వీనర్ కోట బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు సిరిపురపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పోలమ్మతల్లి ఆలయంలో ఈ పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు మాట్లాడుతూ వైయస్ కుటుంబాన్ని కష్టాల పాల్జేస్తున్న ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల ధోరణిని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు.
ప్రజలంతా ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. షర్మిల పాదయాత్ర కోసం ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారన్నారు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను ఒక మహిళ చేపట్టడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో అపూర్వమన్నారు. షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ నాయకులు, కార్యకర్తలు అమ్మవారికి టెంకాయలు కొట్టారు. పార్టీ మండల యూత్ కన్వీనర్ మేడపాటి వరప్రసాద్‌రెడ్డి, వాణిజ్య విభాగం నియోజకవర్గ కన్వీనర్ వీవీవీ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
సీయోను చర్చిలో ప్రార్థనలు
కొమరగిరిపట్నం: షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలంటూ కొమరగిరిపట్నం సీయోను ప్రార్థనమందిరంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్ పచ్చిమాల శ్రీనువాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. నాటి వైయస్ఆర్ యాత్ర తరహాలోనే షర్మిల పాదయాత్ర కూడా విజయవంతం కావాలంటూ బ్రదర్ ప్రసాద్ తదితరులు ప్రార్థనలు చేశారు. జగన్‌కు దేవుడు అండగా వుండాలని, త్వరలోనే ఆయన విడుదల కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాకర నారాయణమూర్తి,గెద్దాడ జాన్‌తాతారావు, కుడిపూడి ఆశ్వరరావు, కలిగితి వెంకటేష్, నాతిచిన్ని తదితరులు పాల్గొన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ రాయవరంలో పార్టీ నాయకులు, అభిమానులు  పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ మండల కన్వీనర్ కోట బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు సిరిపురపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పోలమ్మతల్లి ఆలయంలో ఈ పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు మాట్లాడుతూ వైయస్ కుటుంబాన్ని కష్టాల పాల్జేస్తున్న ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల ధోరణిని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు.

Back to Top