పాదయాత్రలో 201.3 కి.మీలు పూర్తి

ఉరవకొండ

1 నవంబర్ 2012 : మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల గురువారంనాటితో మొత్తం 201.3
కిలోమీటర్లు నడక పూర్తి చేశారు. పదిహేనవరోజు పాదయాత్రలో గురువారం ఆమె 13
కి.మీలు నడిచారు. తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా షర్మిల పాదయాత్ర నిరాఘాటంగా సాగిపోయింది. గురువారం జడివానలో తడుస్తూ సైతం ఆమె పాదయాత్ర కొనసాగించారు. నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గురునాథరెడ్డి,  వైయస్ఆర్ సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఉరవకొండ పార్టీ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, కొల్లి నిర్మల కుమారి, వాసిరెడ్డి పద్మ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాపు భారతి తదితరులు గురువారం పాదయాత్రలో పాల్గొన్నారు. వర్షం కారణంగా గురువారం ఉదయం 11 గంటలకు పాదయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం ఆగకపోవడంతో వర్షంలోనే ఆమె నడక కొనసాగించారు. రాత్రి 7.30కు భంభంస్వామి గుట్ట వద్ద బసచేశారు. 



Back to Top