షర్మిలకు సంఘీభావం.. తరలివచ్చిన నేతలు

కర్నూలు:

రాయలసీమలోని మూడు జిల్లాల్లో దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకుని తెలంగాణలోని పాలమూరు జిల్లాకు బయలుదేరిన షర్మిలకు సంఘీభావంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు గురువారం  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరు ఎమ్‌పీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ శాసనసభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు వై. బాలనాగిరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, కె. శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, బాలరాజు, రాజేశ్, గురునాథ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వీరిలో ఉన్నారు. ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకర రావు, పార్టీ సీజీసీ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి, చందా లింగయ్యదొర, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, సుభాష్ చంద్రబోస్, మారెప్ప, సీఈసీ సభ్యుడు వై. విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాశరావు, గౌరు చరితా రెడ్డి, ప్రసాదరాజు, గండి బాబ్జీ, కె. నారాయణ స్వామి, సాయిప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎస్.వి. మోహన్ రెడ్డి, రెహమాన్, కర్నూలు జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, తెలంగాణ ప్రాంత నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కె.కె. మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాజ్‌ఠాకూర్, ఆది శ్రీనివాస్, విష్ణువర్ధనరెడ్డి, శ్రావణ్‌కుమార్, అజయ్ కుమార్, బాలమణెమ్మ, ఎడ్మ కిష్టారెడ్డి, పుట్టా మధు, విజయారెడ్డి, అయిలి రమేశ్, శ్వేత వెంకట్రామిరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి, తదితరులు షర్మిల వెంట కదం తొక్కారు. బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్లు గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశరావు, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జనక్‌ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, ఎల్లసిరి గోపాల్‌రెడ్డితో పాటు కర్నూలు జిల్లా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు తెలంగాణలోని పది జిల్లాల వైయస్ఆర్ కాంగ్రెస్  కన్వీనర్లు, ఇన్‌చార్జిలు తదితరులు యాత్రలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 15 రోజుల పాటు షర్మిలతో కలిసి యాత్ర చేసిన శోభా నాగిరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన తరువాత వెనుదిరిగారు.

Back to Top