షర్మిలకు జలగం వెంకట్రావు సంఘీభావం

ఖమ్మం, 10 మే 2013:

ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న శ్రీమతి వైయస్ షర్మిలను మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు శుక్రవారం కలుసుకున్నారు. సత్తుపల్లి మండలం మందాలపాడులో ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అంతకు ముందు ఆమె రామచంద్రరావు బంజర నుంచి పాదయాత్రను ప్రారంభించారు. శుక్రవారం ఆమె 12.2 కిలోమీటర్లు నడుస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించారు. మందలపాడు వరకూ 144వ రోజు పాదయాత్ర సాగుతుంది. లంకపల్లిలో భోజన విరామం తీసుకుంటారు.

Back to Top