18 నుంచి షర్మిల పరామర్శ యాత్ర


హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈనెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్రను చేపట్టనున్నా రని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాల యంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. షర్మిల రెండో విడత యాత్ర ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులు జరుగుతుందని చెప్పారు. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో  షర్మిల 509 కిలోమీటర్లు పర్యటిస్తారు. రెండో విడత యాత్రలో ఆమె 17 కుటుంబాలను ఆమె పరా మర్శిస్తారు. బుధవారం (ఇవాళ) జరగాల్సిన వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ కార్యాలయ ప్రారం భోత్సవం వైఎస్ జగన్ అందు బాటులో లేని కారణంగా వాయిదా పడిందని శివకుమార్ పేర్కొన్నారు. కార్యాలయాన్ని 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్‌లో ఆయన ప్రారంభిస్తారని చెప్పారు.
Back to Top