'అనంత'లో షర్మిలకు ఘన స్వాగతం


దాడితోట(అనంతపురం):

మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం అనంతపురం జిల్లా సరిహద్దు దాడితోటకు చేరుకుంది. ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, వై. విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత ఆమెకు ఘన స్వగతం పలికారు. వేల సంఖ్యలో ప్రజానీకం, వైయస్ఆర్ కాగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలకడానికి విచ్చేశారు. అనంతపురం జిల్లాలో షర్మిల 200 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఐదు నియోజకవర్గాల్లోని 75 గ్రామాల మీదుగా ఆమె యాత్ర సాగుతుంది.

Back to Top