ఏపీలో పడకేసిన పారిశుధ్యం..



279 జీవోతో కాంట్రాక్టు వ్యవస్థ నిర్వీర్యం..
వైయస్‌ఆర్‌సీపీ నేత గౌతంరెడ్డి

విజయవాడః ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం చెత్తలో మునిగి తేలుతున్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత పి.గౌతంరెడ్డి అన్నారు.సుమారు ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీస స్పందన కూడాలేదని విమర్శించారు.  పారిశుధ్యాన్ని మెరుగుపర్చవలసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను అనారోగ్యపాలు చేస్తుందని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  గ్రీన్‌ సిటీ,క్లీన్‌ సిటీ,లేక్‌  సిటీ, ఓషియన్‌ సిటీ అంటూ నగరాలకు ముద్దుపెట్టి పబ్లిసిటీలో ముందున్నారని, ఏపీని స్వచ్ఛ ఆంధప్రదేశ్‌గా ప్రచారం చేస్తూ  చెత్త ఆంధ్రపదేశ్‌గా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాతావరణం మార్పుదిశగా  చలి పెరుగుతోందని అనేక రోగాలు ముసురుకొనే పరిస్థితులు వున్నా పారిశు«ధ్యం విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. ఏపీలో 40 వేల కార్మికులు మున్సిపాల్టీల్లో పనిచేస్తున్నారని వారిలో 15వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉన్నారన్నారు.110 పట్టణాలుల్లో పారిశుధ్య కార్మికుల సమ్మె జరుగుతున్నా  ప్రభుత్వం  కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నీమ్మకు నీరెత్తినట్లు వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు 279 జీవో మాత్రమే  రద్దు చేయమని మాత్రమే అడుగుతున్నారన్నారు. కార్పొరేట్,కాంట్రాక్టు, డ్వాక్రా వ్యవస్థను మేమే తీసుకొచ్చామని చంద్రబాబు పగల్భాలు పలుకుతున్నారని, కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చిన చంద్రబాబుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు పరచవలసిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.. కాంట్రాక్టు కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు నేడు  కాంట్రాక్ట్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశ్యంతో  చంద్రబాబు ప్రభుత్వం 279 జీవో తీసుకొచ్చిందని మండిపడ్డారు. వెంటనే పారిశుధ్యం కార్మికుల సమస్యలపై కమిటీ వేసి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
Back to Top