సమస్యలపై పోరాడేది వైయస్‌ఆర్ సీపీ ఒక్కటే: మనోహర్

చిత్తూరు: ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏయస్. మనోహర్ చెప్పారు. గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గూలింగ్స్‌పేట, దర్గాసర్కిల్, ఎంజీఆర్ వీధి, కయినికట్టువీధి, పల మనేరు రోడ్డు, పిరాన్‌సాహెబ్‌వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వైయస్.రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమం కోసం ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటోందని వి మర్శించారు. ఇష్టానుసారంగా పన్నుల భారం మోపుతోందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇం దిరమ్మబాట అంటూ, ప్రతిపక్ష నేత చంద్రబాబు ‘మీ కోసం వస్తున్నా’ అంటూ నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితిల్లో లేరని తెలిపారు. 

ఫ్యాన్ గాలికి ఆ రెండు పార్టీలు మాయం
గౌతంనగర్: రానున్న రోజుల్లో ‘ఫ్యాన్’ గాలికి ‘హస్తం, సైకిల్’ కొట్టుకుపోతాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి. జనార్దన్‌రెడ్డి అన్నారు. వైయస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావ డం ఖాయమన్నారు. పార్టీ నాయకులు దామగళ్ల శివప్రసాద్, బోనగిరి పాండుల ఆధ్వర్యంలో మల్కాజిగిరి సర్కిల్‌కు చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపిలకు చెందిన వందలాది మంది యువకులు, మహిళలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనార్దన్‌రెడ్డి గౌతంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీలో చేరినవారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో శ్రీకాంత్‌యాదవ్, మహేష్‌యాదవ్, శివనాథ్ గుప్త, సురేష్‌యాదవ్, ఆనంద్‌యాదవ్, భాస్కర్, గీతాభవాని తదితరులున్నారు. అనంతరం గౌతంనగర్ చౌరస్తా నుంచి నేరేడ్‌మెట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

Back to Top