‘సహకారం' లో సత్తా చాటుదాం

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా):

సంస్థాగతంగా బలపడి త్వరలో జరగబోయే సహకార సంఘాల ఎన్నికల్లో మన బలం నిరూపించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజలకు మన అండ ఉందన్న భరోసా కల్పించాలన్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని అన్నారు.  తొమ్మిది మాసాల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. తాడేపల్లిగూడెం శ్రీకృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అధ్యక్షత వహించారు. తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ కన్వీనర్ యెగ్గిన నాగబాబు స్వాగతం పలికారు.

Back to Top