సబ్ స్టేషన్లను ముట్టడించిన వైయస్ఆర్ సీపీ

హైదరాబాద్:

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సబ్‌స్టేషన్ల ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ధర్నాలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సబ్ స్టేషన్ ఎదుట పార్టీ నేతలు,  కార్యకర్తలు ధర్నాకు దిగారు. చిత్తూరు జిల్లా వరదాయపాలెం సబ్ స్టేషన్ వద్ద రైతులతో కలసి పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సబ్ స్టేషన్, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గూడురు సబ్ స్టేషన్, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగారు.  కృష్ణా జిల్లా నందిగామ సబ్ స్టేషన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ సబ్ స్టేషన్, గుంటూరు జిల్లా పొన్నూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, మెదక్ జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట సబ్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

Back to Top