పట్టిసీమ ప్రాజెక్టు బండారం బయటపడుతుందని టీడీపీ నేతలకు భయం


హైదరాబాద్: వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు ఎందుకు కలవరపడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ప్రజాసమస్యలపై ప్రధాని మోదీని కలిస్తే దాన్ని వక్రీకరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మీరు కలిసి పోటీ చేసిన బీజేపీపైనే నమ్మకం లేదా, మోదీపై మీకేమైనా అనుమానమా అని సూటిగా ప్రశ్నించారు.

దొడ్డిదారిన మంత్రి అయిన యనమల రామకృష్ణుడు.. వైఎస్ జగన్ ను విమర్శించడం వింతగా ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు బండారం బయటపడుతుందని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం రాయలసీమకు కాదు.. చంద్రబాబు, లోకేశ్ లకేనని రోజా అన్నారు.
Back to Top