చంద్రబాబు అవినీతి మానసపుత్రిక పట్టిసీమ..!

హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలోకి  రాగానే రాష్ట్రంలో మళ్లీ కరువు సంభవించిందని అన్నారు. కృష్ణాడెల్టాలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని, 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలంలో నీళ్లు అడుగంటిపోయాయని ఎద్దేవా చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల సాకుతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.  పట్టిసీమ పేరుతో జరుగుతున్న అవినీతికి తాము పూర్తి వ్యతిరేకమని రోజా తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కు చంద్రబాబు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలు పంపులే వేయకుండా పట్టిసీమను జాతికి అంకితం చేయడం చరిత్రలో ఎక్కడైనా ఉందా అని రోజా చంద్రబాబును ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు ఎన్ని చుక్కల నీరిచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు అవినీతి మానస పుత్రిక పట్టిసీమకు..22 శాతం అదనంగా టెండర్లు  వేసి ఖరారు చేసింది వాస్తవమో కాదా అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు నీరిస్తామని జీవోలో ఎక్కడైనా చూపించారా అని అడిగారు.
Back to Top