ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన రోజా

హైదరాబాద్ః నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు.  కేవలం టీడీపీ ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణకు రావాలని ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాళ రోజా అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. 


ప్రివిలేజ్ కమిటీలో ఒక్కరు మినహా అంతా  అధికారపార్టీ నేతలే ఉండడంతో టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షనేతను, సభ్యులను దూషించిన అధికారపార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు  ఇటీవల 20 సార్లు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఐతే, ఇంతవరకు ఒక్కదానిపై కూడా విచారించలేదు.  ఏకపక్ష పోకడలకు పోతూ అధికారపక్షం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపుకు పాల్పడుతోంది.
Back to Top