వైయస్‌ జగన్‌ వ్యక్తిగత ప్రతిష్టకు రాధాకృష్ణ భంగం కలిగించారుఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురు
క్వాష్ పిటీషన్‌ను తిరస్కరించిన గౌరవ న్యాయస్థానం

చేతుల్లో పత్రిక ఉందని ఇష్టం వచ్చినట్లుగా రాతలు
వాస్తవాలు ఉంటే ఎందుకు కోర్టుకు ఎందుకు హాజరుకావడం లేదు
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు హాజరు మినహాయింపు కోరుతూ వేసిన క్వాష్ పిటీషన్‌ను గౌరవ న్యాయస్థానం తిరస్కరించింది. ఎట్టిపరిస్థితిల్లో విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు వవద్ద ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ పాలన, ప్రత్యేక హోదా, ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని గతంలో ప్రధాని మోడీని వైయస్‌ జగన్‌ కలిశారని గుర్తు చేశారు. ప్రధానిని ఏఏ అంశాలపై కలిశామో వైయస్‌ జగన్‌ మీడియాకు వివరించడంతో పాటు.. ప్రధాని ఇచ్చిన లేఖ కాపీని ప్రెస్‌కు కూడా ఇచ్చారన్నారు. అయినా వ్యక్తిగత అవసరాల కోసం, కేసులు కొట్టేయించుకోవడం కోసం ప్రధాని కాళ్లు పట్టుకున్నారంటూ తన పత్రికలో రాధాకృష్ణ తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. దీనిపై వైయస్‌ జగన్‌ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారంటూ కోర్టును ఆశ్రయించానని ఆర్కే వివరించారు. 

పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టిందని, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు సమాన్లు జారీ చేసిందని ఎమ్మెల్యే ఆర్కే వివరించారు. గౌరవ న్యాయస్థానం విచారణకు  పిలిచినా రాధాకృష్ణ హాజరుకాలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నందున హాజరుకాలేకపోయారంటూ రాధాకృష్ణ తరుపు న్యాయవాది కోర్టు తెలపడంతో అసెంబ్లీ సమావేశాలతో ఆయనకు పనేంటీ.. హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆర్కే చెప్పారు. దీంతో కోర్టుకు హాజరును మినహాయిస్తూ వేమూరి రాధాకృష్ణ క్వాష్ పిటీషన్‌ వేయడంతో కోర్టు ఆగ్రహిస్తూ పిటీషన్‌ను తిరస్కరించిందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించిందన్నారు. 

చేతుల్లో పత్రిక ఉందని ఇష్టం వచ్చినట్లుగా అవాస్తవాలు ప్రచురించి చంద్రబాబుకు సర్వస్వం తానే అయినట్లుగా వేమూరి రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ పరువుకు భంగం కలిగించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రధానిని కలిసింది వ్యక్తిగత అవసరాలకేనని వాస్తవాలు, సాక్షాధారాలు ఉన్న వ్యక్తి అయితే కోర్టుకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. పత్రిక చేతిలో ఉందని బురదజల్లడం.. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంత వరకు సమంజసం అన్నారు. వాస్తవాలు ప్రచురిస్తే రాధాకృష్ణ ధైర్యంగా కోర్టుకు హాజరుకావాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top