గొట్టంగాళ్ల అవినీతిని బయటకు తీయాలి

  • రాజధాని నిర్మాణం పేరుతో వందలాది కోట్లు దోచుకున్నారు
  • వర్షం పడిన రెండ్రోజుల తర్వాత అసెంబ్లీలోకి ఆహ్వానం విడ్డూరం
  • గొట్టాల మీద సీఐడీ ఎంక్వైరీ వేయడం కాదు..?
  • సీబీఐ ఎంక్వైరీ అంటే మీకెందుకంత వణుకు
  • మా ఎమ్మెల్యేలకు పచ్చకుండువాలు కప్పినప్పుడు..
  • మీ విధి, ధర్మం గుర్తుకు రాలేదా స్పీకర్ గారు..?
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్ః అసెంబ్లీ లీకేజీ ఘటనను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శాసనసభలోకి అందరికీ ప్రవేశం కల్పిస్తున్నామని స్పీకర్ చెప్పడం విడ్డూరమని ఆర్కే అన్నారు. వర్షం పడిన రోజు అసెంబ్లీలోకి  మీడియాను అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా పంపించని మీరు...రెండ్రోజుల తర్వాత దాన్ని సుందరంగా తీర్చిదిద్ది అందరినీ అనుమతిస్తున్నామని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. అసలు వర్షమే కురవలేదు, అసెంబ్లీ లోపల ఏమీ జరగలేదని స్పీకర్ చెప్పే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఆరోజు స్పీకర్  వచ్చి సరాసరి పైపు కోసిన ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లి చూపించడం, ఇది ఎవరో కోశారంటూ సీఐడీ ఎంక్వైరీ వేయడాన్ని ఆర్కే తీవ్రంగా తప్పుబట్టారు. మీరు గొట్టాల మీద కాదు సీఐడీ ఎంక్వైరీ వేయాల్సింది...రూ. కోట్లాది ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న గొట్టంగాళ్ల అవినీతిని బయటకు తీసేందుకు సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఆర్కే ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు.   

వర్షం కురిసిన రోజు స్థానిక శాసనసభ్యుడిగా వెంటనే అక్కడకు చేరుకొని అసెంబ్లీలోకి వెళ్లానని.... తడిసి ముద్దయిన ప్రతిపక్ష నేత వైయస్ జగ్ ఛాంబర్, ఊడిన సీలింగ్ పెచ్చులను చూసి ఆశ్చర్యమేసిందన్నారు. ఆ రోజు మా ఎమ్మెల్యేలతో పాటు మీడియాను లోపలికి ఎలో చూసి ఉంటే అంతా చూపించేవాళ్లమన్నారు. స్పీకర్ డైరెక్ట్ పైపు కోసిన దగ్గరకు కాకుండా వైయస్ జగన్ గది, పక్కనే ఉన్న వైయస్సార్సీపీ పేషీలోకి...అదేవిధంగా ముఖ్యమంత్రి, అసెంబ్లీ, మీ ఛాబర్, మంత్రుల ఛాబర్ లకు మీడియాను తీసుకెళ్లి ఉంటే బాగుండేదని ఆర్కే కోడెల శివప్రసాదరావుకు చురక అంటించారు. అలా చేయకుండా పైపు కోసిన దగ్గరకే ఎందుకు వెళ్లారు, మీకెందుకంత భయం అని స్పీకర్ ను ప్రశ్నించారు.  కొద్దిపాటి వర్షానికే  వైయస్ జగన్ గది దారుణంగా దెబ్బతిన్నదని... స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రుల ఛాంబర్స్,  ఫైల్స్ తడిసిపోయాయని ఆర్కే అన్నారు. రెండ్రోజుల తర్వాత మరమ్మతులు చేసి  అందరినీ పిలవడం విడ్డూరమని స్పీకర్ తీరుపై మండిపడ్డారు. వర్షం పడిందన్న ఆనవాళ్లు లేకుండా చేయడంలో టీడీపీ వాళ్లు సిద్ధహస్తులని ఆర్కే ఎత్తిపొడిచారు.  

రాజధాని నిర్మాణాలను అడ్డంపెట్టుకొని చంద్రబాబు వందలాది కోట్లు దోపిడీ చేశారని, దాన్ని కాపాడేందుకే స్పీకర్ ఈ విధంగా చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆర్కే అన్నారు. వైయస్సార్సీపీపై నిందలు వేయడానికి, కేసును తప్పుదారి పట్టించేందుకే తడిసి కుదేలయిన అసెంబ్లీని సరిదిద్ది అందరికీ ఆహ్వానం పలుకుతున్నారని ఆర్కే ఎద్దేవా చేశారు.  ఓ ప్రదేశంలోజరగకూడనివి జరిగినప్పుడు సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీల్లేదని, అది తెలిసి కూడ స్పీకర్ కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించడం అంతకన్నా దారుణం మరొకటి ఉండదని ఆర్కే అన్నారు.  సీఐడీ విచారణ పేరుతో వైయస్సార్సీపీ ఎల్పీ, పేషీలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను వేధిస్తూ, భయపెడుతూ, వైయస్సార్సీపీ వాళ్లే ఈపని చేశారని చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానం కలుగుతోందని ఆర్కే అన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసి అక్కడ ఏమీ జరగలేదంటే ఎవరూ నమ్మరని ప్రభుత్వానికి హితవు పలికారు.

 సీఐడీకి ఆదేశించడం నా విధి, ధర్మం అని స్పీకర్ చెబుతున్నారని..అసెంబ్లీలో  వైయస్ జగన్ ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే మీరు మైక్ కట్ చేసినప్పుడు గుర్తులేదా మీ విధి, ధర్మం...?  టీడీపీ సభ్యులు సభలో మమ్మల్ని అనరాని మాటలంటే...వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. ఆరోజు గుర్తుకు రాలేదా మీ విధి, ధర్మం...? ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రే చేసిన ప్రమాణాలు మర్చి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పుతుంటే చర్యలు తీసుకోలేదు. అప్పుడు గుర్తుకు రాలేదా మీ విధి, ధర్మం..? అలా చేర్చుకున్న వారిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించినా మౌనంగా ఉన్నారు తప్పితే చర్యలు తీసుకోలేదు. అప్పుడు గుర్తుకు రాలేదా మీ ధర్మం..? సభను నిర్వహించి, నియంత్రించే అధికారమున్న స్పీకరే...నా ప్రమాణం అయిపోగానే సభను వాయిదా వేయమని ముఖ్యమంత్రి  కాల్వకు చెప్పడం ఆయన మీకు సైగలు చేయడం...మీరు వెంటనే సభను నిరవధికంగా వాయిదగా వేయించడం మర్చిపోయారా..? మీవిధి, ధర్మం అప్పుడు గుర్తుకు రాలేదా అని స్పీకర్ తీరును ఆర్కే ఎండగట్టారు. సీబీఐచే విచారణ జరిపిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందని భయపడే సీఐడీ అంటున్నారని ఆర్కే ఎద్దేవా చేశారు. 

 
Back to Top