అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

శ్రీకాకుళం: నాలుగున్నరేళ్లు లక్షల కోట్ల రూపాయల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఒక కొంగ జపం అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముద్దని అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం రామనామజపం అయిందన్నారు. అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వైయస్‌ఆర్‌ సీపీపై తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపీలో దోపిడీ తప్ప అభివృద్ధి ఎక్కడుందని, శ్వేతపత్రం మరో అబద్ధపు ప్రచార జిమ్మిక్కు మాత్రమేనన్నారు. దమ్ముంటే అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top