చంద్రబాబు నియంత పాలన...!

వైఎస్సార్ జిల్లాః  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చంద్రబాబు హిట్లర్ మాదిరి నియంత పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ నేతల జోక్యం శృతిమించుతోందని రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు, రుణాల మంజూరు వంటి పథకాల లబ్ధిదారులను జన్మభూమి కమిటీ ఛైర్మన్ లతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే ఎంపిక చేస్తూ జాబితా నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు అధికారులు వంత పాడుతున్నారని అన్నారు.

అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే అధికారులపై ...సివిల్, క్రమినల్ చర్యలకు  న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ....ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై మండిపడ్డారు. 

Back to Top