రాష్ట్ర‌మంతా ప్ర‌త్యేక‌హోదా నినాదం

హైద‌రాబాద్ : ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ న్యూఢిల్లీలో నిర్వ‌హించిన
ప్ర‌త్యేక ధ‌ర్నాకు సంఘీభావంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని జిల్లా
కేంద్రాలు, ముఖ్య న‌గ‌రాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. పార్టీ ఎంపీలు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి నేత‌లు, ముఖ్య కార్య‌క‌ర్త‌లు
ఇప్ప‌టికే ఢిల్లీ వెళ్లి అక్క‌డి మ‌హా ధ‌ర్నాలో పాల్గొన్నారు.

రాష్ట్ర
ప్ర‌జ‌ల కోసం వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నంలో తాము సైతం భాగ‌స్వాములు
అయ్యేందుకు జిల్లాల్లోని ఇత‌ర నాయ‌కులు, ముఖ్య కార్య‌క‌ర్త‌లు, క్రియా
శీలురు రంగంలోకి దిగారు. ఆయా జిల్లాల కేంద్రాలు, ఇత‌ర ముఖ్య పట్ట‌ణాల్లో
ధ‌ర్నాలు నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదా - ఏపీ హ‌క్కు అంటూ నిన‌దించారు.
ప్ర‌జ‌ల త‌ర‌పున నిరంత‌రాయంగా పోరాడుతున్న వైఎస్ జ‌గ‌న్ కు త‌మ సంఘీభావం
తెలిపారు.
Back to Top