విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం

రాజ్యస‌భ స‌భ్యుడిగా ఎన్నికైన నాలుగు నెల‌ల‌కే వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది. రాజ్యస‌భ చైర్మన్ హ‌మీద్ అన్సారీ విజయసాయిరెడ్డిని నిబంధనల కమిటీలో సభ్యునిగా నామినేట్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పెద్దల స‌భ‌లో రూల్స్ కి సంబంధించిన క‌మిటీలో విజ‌య‌సాయిరెడ్డికి చోటు ద‌క్కడం పార్టీకే గౌరవంగా భావిస్తున్నారు. 

హ‌మీద్ అన్సారీ చైర్మన్ గా ఉండే ఈ క‌మిటీలో డీఎంకే ఎంపీ తిరుచి శివ‌, ఎస్పీ తరుపున ఎంపీ రేవ‌తి ర‌మ‌ణ్ సింగ్, మ‌రో ఎంపీ సుభాష్ చంద్ర ఉన్నారు.  పార్టీ రాజ్యసభ సభ్యునికి ఇటువంటి అవకాశం వచ్చినందుకు పార్టీ అధినేత వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి అభినందనలు తెలిపారు.
Back to Top