మహాధర్నాకు ర్యాలీగా

రొద్దం: ఉరవకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం అమ్మవారుపల్లి వద్ద వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ధర్నాకు రొద్దం మండలం నుంచి భారీగా తరలివెళ్లారు.మండల కేంద్రంలోని వైయస్‌ఆర్‌ విగ్రహం వద్ద నుంచి పెద్ద ఎత్తున బైక్‌ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 150 బైక్‌లలో నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు  మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Back to Top