పేదలకు ఆసరాగా రాజన్న రైతు బజార్‌
రూ.10కే 8 రకాల కూరగాయలు
మంగళగిరి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని రత్నాల చెరువులో ఏర్పాటు చేసిన రాజన్న రైతు బజార్‌ పేదలకు ఆసరాగా మారింది. రాజన్న రైతు బజార్‌లో రూ.10కే ఎనిమిది రకాల కూరగాయలు అందజేస్త్నునారు. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రైతు బజార్‌లో కూరగాయాలను కొనుగోలు చేశారు. రాజధాని రైతు, రైతు కూలీ సంక్షేమ సంఘం పేరిట ఏర్పాటు చేసిన రాజన్న రైతు బజార్‌ను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మీ చేరో లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. పేద ప్రజల కోసమే తక్కవ ధరకు కూరగాయలు అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. 
 
Back to Top