వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం..

విజయనగరంః రాజన్న రాజ్యం మళ్లీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సా«ధ్యమవుతుందని ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు.కురుపాంలో జరిగిన బహిరంగ సభకు లక్షల మంది స్వచ్ఛందంగా తరలివరావడం టీడీపీ పాలనపై ఉన్న  ప్రజా వ్యతిరేకత తేటతెల్లమవుతోందదన్నారు. బహిరంగ సభలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పట్ల నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామో కూలంకషంగా తెలపడం కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో కూడా జననేతకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
 
Back to Top